Tuesday, January 7, 2025

‘శాకుంతలం’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Sakunthalam movie release on nov 4

సమంత, దేవ్‌మోహన్ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘శాకుంతలం’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 4న విడుదలకు సిద్ధమైంది. శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. ఇటీవల ‘శాకుంతలం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న ఆసక్తి మరో లెవెల్‌కు చేరుకుంది. ఎపిక్ ఫిల్మ్‌మేకర్, డైరెక్టర్ గుణశేఖర్ కాశ్మీర్‌లో సాగే ఈ ప్రేమ కథను తనదైన మార్క్‌తో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, కబీర్ బేడి, డా.ఎం.మోహన్‌బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్,అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించడం ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా ‘శాకుంతలం’ సినిమా రూపొందుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News