Wednesday, January 1, 2025

గన్ పట్టుకున్న ప్రభాస్… డిసెంబర్ 1న సలార్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్ నటిస్తున్న సలార్-1 సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సలార్-1 మూవీ ట్రైలర్‌ను డిసెంబర్-1 విడుల చేస్తామని సినిమా బృందం వెల్లడించింది. సోమవారం ఈ సినిమాలో కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ప్రభాస్ గన్ పెట్టుకొని ఫైర్ చేస్తున్న దృశ్యాలు బాగున్నాయని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పాన్ ఇండియా లేవల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల చేయనున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి తదితరలు నటించనున్నారు. ఈ సినిమాను హోంబలే పతాకంపై విజయ్ కిరంగ్‌దూర్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News