Wednesday, January 22, 2025

ప్రేక్షకులను ఫిదా చేస్తున్న.. ఈ ‘సలార్’ నటి ఎవరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

శ్రియా రెడ్డి.. ఇప్పుడీ పేరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు.. ఇటీవల విడుదలై ఇండియన్ భాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ కొల్లడుతున్న సలార్ మూవీలో శ్రియా రెడ్డి నటించడమే. ఈ మూవీ చూసిన వారంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో రాధా రామగా తన నటనతోపాటు ఆమె వేషాధారణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో పాత్రకు తగ్గట్లు.. శ్రియా రెడ్డి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు మేకర్స్. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన పాత్రకు ఎంత పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. సలార్ లోనూ ఆ స్థాయి నటన, ఆహాభావాలతో సూపర్ గా నటించిందని… మరో శివగామిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ నటి. దీంతో ఇంతకీ ఈమె ఎవరని గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

శ్రియా రెడ్డి విషయానికి వస్తే.. మాజీ భారత తెలుగు క్రికెటర్ భరత్ రెడ్డి కూతురే.. ఈ శ్రియా రెడ్డి. కెరీర్ మొదట్లో యాంకర్, విజెగా పనిచేశారు. ఎస్.ఎస్.మ్యూజిక్ అనే చానల్లో వీడియో జాకీగా పనిచేసేవారు శ్రియా.. 2002లో హీరో విక్రమ్ నటించిన సమురాయ్ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించింది. తమిళ స్టార్ హీరో విశాల్ పొగరు సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టింది. ఈ క్రమంలో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన శ్రియారెడ్డి.. ఇటీవల ఓటీటీలో వచ్చిన సుడల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News