Monday, December 23, 2024

ప్రభాస్ స్టార్ డమ్ స్టామినా.. 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లు

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్ పార్ట్ 1, సీజ్ పైర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రేర్ ఫీట్ సాధించింది. ఈ నెల 22న రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 500 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ టచ్ చేసింది. సలార్ తో ప్రభాస్ స్టార్ డమ్ ను మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా తర్వాత సలార్ తో ప్రభాస్ మరోసారి 500 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో చేరారు. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్  డే 1 కలెక్షన్స్ సాధించిన సలార్….నేషనల్ చైన్స్ లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా గట్టి పోటీ ఇచ్చినా ప్రతి రోజూ తన బాక్సాఫీస్ నెంబర్స్ పెంచుకుంటూనే వచ్చింది.

ఈ ట్రెండ్ చూస్తుంటే సలార్ కలెక్షన్స్ లో ఓవర్సీస్ సహా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. సలార్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News