Wednesday, January 22, 2025

కోట్లు కొల్లగొడుతున్న సలార్.. మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే..!

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా మూవీ సలార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, రెబెల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన సలార్ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో 250 కోట్ల రూపాయల మార్క్ ని దాటింది. హోంబలే ఫిల్మ్ రూ. 400 కోట్ల ఖర్చుతో సలార్ నిర్మించగా, మూడు రోజుల్లోనే పెట్టుబడి తిరిగి రావడం విశేషం.

వచ్చే ఏడాది సలార్ కు సీక్వెల్ షూటింగ్ మొదలుకాబోతోంది. దీనికి సలార్-శౌర్యాంగపర్వం అని పేరు పెట్టారు. తారాగణాన్ని ఎంపిక చేసుకుని, షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి. మొదటి పార్ట్ కంటే, రెండో పార్ట్ ఇంకా బాగుంటుందని స్వయంగా ప్రభాసే ప్రకటించడంతో అభిమానులు సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News