Monday, December 23, 2024

అమెరికాలో సలార్ జోరు, 10 కోట్లకు చేరిన ప్రీమియర్ షోల వసూలు

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్- పార్ట్1: సీజ్ ఫైర్ రిలీజ్ కు ముందే అమెరికాలో దుమ్ము దులుపుతోంది. ప్రీమియర్ షోలపై 1,201,511 డాలర్లు (9.97 కోట్ల రూపాయలు) వసూలు చేసి, రికార్డు సృష్టించింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగులపై ఒక భారతీయ సినిమా ఇన్ని వసూళ్లు సాధించడం ఒక రికార్డు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ ప్రీమియర్ షోల బుకింగులు అమెరికాలో మూడు రోజుల కిందట మొదలయ్యాయి. అమెరికావ్యాప్తంగా 472 ప్రాంతాల్లో 1530 షోలకోసం ఇప్పటివరకూ 45423 టికెట్లు అమ్ముడుపోయాయి. కాగా సలార్ వసూళ్లతో పోలిస్తే, షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా కాస్త వెనుకబడింది. డంకీ… 19500 టికెట్ల విక్రయంపై 2,67,100 డాలర్లు వసూలు చేసింది.

డంకీ మూవీ ఈనెల 21న, సలార్ 22న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News