పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్రకు వాణీ కపూర్‌ని తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇండియాలోనే ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు, మైసూరులోనే మేజర్ షెడ్యూల్స్ చిత్రీకరణ సాగుతుందని తెలిసింది. ఈ మూవీలో కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా 1970 కాలాన్ని స్ఫురణకు తెచ్చేలా సెట్స్ వేయనున్నారని… ఇందులో కీలక షెడ్యూల్ ని చిత్రీకరిస్తారని సమాచారం. నాటి కాలాన్ని తలపించేలా అద్భుతమైన సెట్‌ని మైసూర్లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆర్ట్ వర్క్ టీమ్‌ని దించుతున్నారట. అక్కడ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించడానికి ఆ సెట్‌ని వినియోగించనున్నారని సమాచారం.
అలాగే 1970 కాలానికి చెందిన ఓ బైక్‌ని కూడా ప్రభాస్ కోసం సిద్ధం చేయించారు. ఈ బైక్‌ని యాక్షన్ సన్నివేశాల్లో హైలైట్ చేయనున్నట్లు తెలిసింది. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ సీన్స్ కోసం భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కూడా వాడుతున్నట్లు సమాచారం. ప్రభాస్‌ని ఈ చిత్రంలో మోస్ట్ వయోలెంట్ మ్యాన్‌గా చూడబోతున్నారని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. మునుపెన్నడూ చూడని కొత్త గెటప్‌లో ఈ స్టార్ హీరో సర్ప్రైజ్ చేయబోతున్నారట. 2022 సమ్మర్ నాటికి సలార్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని హోంబలే సంస్థ భావిస్తోంది. దానికి తగ్గట్టు షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ జరుపుకున్న ‘సలార్’ తదుపరి షెడ్యూల్ ఆగస్టులో ప్రారంభమవుతుంది.
Salaar Movie Makers create 1970s backdrop Set