Thursday, December 19, 2024

రిలీజ్‌కి ముందే సలార్ అరుదైన రికార్డ్!

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సలార్ ఒకటి. కెజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ను గతేడాది ప్రారంభమైన ‘సలార్’ మూవీ రెగ్యూలర్‌షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో, రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేశారు. వీటిలో రెబెల్ స్టార్ ప్రభాస్‌పై కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను షూట్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్‌మైషో ఇటీవలే ఈ సినిమా వివరాలను తన వెబ్‌సైట్‌లో పొందుపరచగా ఇప్పటికే 100కె(లక్ష) మంది వీక్షించారు.

అది కూడా టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల కాకముందే ఈ మార్కును చేరుకోవడం ఈ పాన్ ఇండియా మూవీపై మరింత అంచనాలను పెంచాయి. కాగా, ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ‘సలార్’ సెప్టెబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News