Wednesday, January 22, 2025

సలార్ సినిమాకు వెళ్తున్నారా?… ఇది తెలుసుకోండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ కలెక్షన విషయంలో బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది. సలార్ సినిమాకు రోజు రోజు కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22న ఈ సినిమా అన్ని థియేటర్స్‌లలో విడుదలైంది. మొదటి రోజు 180 కోట్లు, రెండో రోజుల దాదాపుగా 150 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. గుంటూరులోని నాజ్‌సెంటర్‌లో ఉన్న పివిఆర్ థియేటర్స్ యాజమాన్యంలో 18 ఏళ్లు నిండని వారిని లోపలికి రానివ్వడంలేదు. అలా టికెట్లు తీసుకున్నవారు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యాజమాన్యానికి, అభిమానులకు మధ్య గొడవలు జరిగాయి. వారం రోజుల్లో రీఫండ్ చేస్తామని యాజమాన్యం చెప్పడంతో వారు వెనుదిరుగారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ జంటగా నటించగా ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఖాన్సార్ అనే నగరం సింహాసనం గెలుచుకోవడం కోసం ముడు కుటుంబాల మధ్య పోరాటం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే ఆ సింహాసానానికి అసలు వారసుడు ప్రభాస్, ఆ సింహాసనం ఏడు రాజ్యాలను కంట్రోల్ చేస్తుంది. దీంతో ఆ సింహాసనం కోసం ప్రభాస్ ఏం చేశాడనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News