Thursday, December 19, 2024

చివరి దశలో చిత్రీకరణ…

- Advertisement -
- Advertisement -

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఇటు దక్షిణాదిన అటు బాలీవుడ్‌లోనూ అందరి చూపు యంగ్ రెబెల్ స్టార్ సినిమాలపైనే ఉందనే చెప్పాలి. ప్రభాస్ లిస్టులో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ’సలార్’ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాల నెలకొన్నాయి. అందుకు కారణం ప్రభాస్ ఒకటైతే.. మరో కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కె.జి.యఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ ఇటీవల ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల చివరి వరకు పూర్తి కానుందని సమాచారం.

షూటింగ్ పూర్తి అయితే ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు. ఇక ‘సలార్’ టీజర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేస్తారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ప్రభాస్ మాస్ యాక్షన్‌ను ప్రశాంత్ నీల్ నెక్స్ రేంజ్‌లో చూపిస్తాడనటంలో సందేహం లేదు. సలార్ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా మరో వైపు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చర్చల దశలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News