Monday, December 23, 2024

ప్రీ క్లైమాక్స్ బడ్జెట్ రెండింతలు!

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా చిత్రీకరణ 30 శాతం వరకు పూర్తయింది. సినిమా చిత్రీకరణ ప్రారంభమై చాలా కాలం అయింది. కాని కరోనా, ఇతర కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించేందుకు దర్శకుడు సిద్ధమయ్యాడు. కేజీఎఫ్ 2 సినిమా సక్సెస్ కావడంతో సలార్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు విడుదల అవుతుందా? అంటూ ఎదురు చూస్తున్నారు.

ఇక సలార్‌లోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మొదట్లో ఈ సన్నివేశానికి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో 10 కోట్లు ఖర్చు చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏకంగా 20 కోట్ల రూపాయలను ఈ ఒక్క ప్రీ క్లైమాక్స్ సన్నివేశానికి ఖర్చు చేయబోతున్నారట. సలార్ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉంటాయని అంటున్నారు.

రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే ఉద్దేశ్యంతో ‘సలార్’ను కూడా భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ ప్రస్తుతం ‘సలార్’ను నిర్మిస్తోంది. కనుక బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇక ప్రభాస్, శృతి హాసన్‌ల మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News