Thursday, December 19, 2024

సలార్ టీషర్ట్స్ ధర ఎంతంటే…

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ సినిమా సలార్ క్రియేట్ చేస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ రూపుదిద్దుకోవడంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. సలార్ రెండు భాగాలుగా వస్తోంది. డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్ధమైన సలార్ కు ప్రమోషన్ వర్క్ స్టార్టయిపోయింది.

ఇందులో భాగంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగే ఈవెంట్స్ లో ప్రభాస్ తోపాటు చిత్ర తారాగణంకూడా పాల్గొనబోతోంది. ప్రభాస్ పక్కన శ్రుతి హాసన్ నటిస్తోంది. జగపతిబాబు, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇకపోతే, సలార్ ప్రమోషన్స్ లో భాగంగా హోంబలే ఫిల్మ్స్ సలార్ టీ షర్ట్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధర 500నుంచి 1500 వరకూ ఉంది. ఇవి hombaleverse వెబ్ సైట్లో లభిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News