Monday, December 23, 2024

‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన సరి కొత్త లుక్‌ను విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘సలార్’ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్. ఇండియా సహా యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో ఈ చిత్రాన్ని తెరకెక్కిన్నారు. ప్రస్తుతం సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ‘సలార్’ మూవీ రిలీజ్ కానుంది.

SALAAR Movie to release on 2023 Sep 28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News