Sunday, January 19, 2025

‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది..ఫ్యాన్స్ కు పండుగే

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సలార్ పార్ట్ 1-సీజ్‌ఫైర్’ ట్రైలర్ వచ్చేసింది. స్టార్ హీరో ప్రభాస్, ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తోంది.

3 నిమిషాల 47 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో ప్రభాస్ ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్క్‌కు తగ్గట్లుగా ఈ ట్రైలర్ రూపుదిద్దుకుంది. ట్రైలర్ చివరలో ప్లీజ్ ఐ యామ్ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్’ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News