Wednesday, January 22, 2025

సలార్ పార్ట్ 2 పేరు ఏంటంటే…

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ మూవీ ‘సలార్’ వసూళ్లలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా రెండు ప్లాపుల తర్వాత వచ్చిన తమ అభిమాన కథానాయకుడి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయింది.

Salaar Part 2 Nameమొదటి సినిమాకి ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ అని పేరు పెట్టడంతోనే దీనికి సీక్వెల్ ఉంటుందని అర్ధమైపోయింది. అయితే దానికి  ఏం పేరు పెడతారా అనే సస్పెన్స్ ఇంతవరకూ ఉండేది. తాజాగా పార్ట్ 2 పేరును ప్రశాంత్ నీల్ బయటపెట్టేశాడు. దాని పేరు ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’. అయితే సలార్ పార్ట్ 2కు సంబంధించి ప్రభాస్ మినహా ఇతర నటీనటుల ఎంపిక జరగలేదని తెలుస్తోంది. పార్ట్ 1లో హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ పార్ట్ 2లో ఉండకపోవచ్చునని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News