Sunday, December 22, 2024

సంచలనాల ‘సలార్’

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22న విడుదల కానున్న సలార్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే రికార్డు సృష్టించింది. అమెరికాలో మొదటి మూడురోజుల్లో పది కోట్లకు పైగా వసూలు చేసిన తొలి భారతీయ సినిమా సలార్ కావడం విశేషం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సలార్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. మొదటి పది రోజులు తెలంగాణలో 65 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లో 40 రూపాయల చొప్పున పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.  మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 రూపాయల వరకూ పెంచే అవకాశం ఉంది. తెలంగాణలో అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా అనుమతి లభించింది. మామూలు షోలతోపాటు తెల్లవారుజామున 4 గంటలకు మరొక షో వేసేందుకు కూడా ప్రభుత్వం సరేనంది. సలార్ మూవీకి ఆన్ లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ప్రారంభం కాగా, ఒత్తిడి పెరగడంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News