Sunday, December 22, 2024

స్నేహితుడి కోసం పోరాటం చేసే దేవా

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోమవారం మేకర్స్ ఈ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్‌ను గమనిస్తే… ఇద్దరు పిల్లల మధ్య స్నేహం, వారు పెరిగి పెద్దయిన తర్వాత కాన్సార్ ప్రాంతానికి రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) కావాలనుకున్న అతనిపై శత్రువులు దాడి చేస్తే తన స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసే దేవా (ప్రభాస్) కథే ‘సలార్ సీజ్ ఫైర్’ అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అంచనాలు రిలీజ్ ట్రైలర్‌తో మరింత పెరిగాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News