Friday, January 3, 2025

‘సలార్’ రిలీజ్ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. కెజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దుమ్ములేపింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు.

కాగా, ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News