Wednesday, January 22, 2025

‘సలార్’ టీజర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. కెజిఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇక మేకర్స్ ‘సలార్’ టీజర్‌ను ఈనెల 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ ప్రతినిధులు మాట్లాడుతూ “సలార్ సినిమా టీజర్‌ను ఈనెల 6న అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నాం. ఈ మెగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ టీజర్‌ను చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు”అని అన్నారు. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతిహాసన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News