Monday, December 23, 2024

ఓటిటిలో సంక్రాంతికే సలార్

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ మూవీ సలార్ బాక్సాఫీసు రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ వసూళ్లు 500 కోట్ల రూపాయలు దాటేశాయి. సలార్ ని ఇంట్లో కూర్చుని చూడాలనుకునేవారందరికీ ఒక శుభవార్త. ఓటీటీలో సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ డేట్ కన్ఫామ్ అయిపోయింది. సలార్ ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి రెండోవారంలో సలార్ ఓటిటిలోకి వస్తుందని మొదట్లో భావించినా, ఇప్పుడు డేట్ మారింది. నెట్ ఫ్లిక్స్ సలార్ ను సంక్రాంతికే స్ట్రీమ్ చేస్తోంది. తాజా సమాచారాన్నిబట్టి జనవరి 12నుంచి నెట్ ఫ్లిక్స్ లో సలార్ స్ట్రీమింగ్ మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News