Sunday, December 22, 2024

రికార్డులను బద్దలు కొట్టిన ‘సలార్‌’ ట్రైల‌ర్‌

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా కాలం క్రితమే ప్రారంభమయ్యాయి.

అయితే అభిమానులు అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సలార్ ట్రైలర్‌ రావడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ‘నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడికోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా.. అంటూ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ప్ర‌భాస్ అభిమానుల‌కు గూజ్‌బంబ్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ విడుదల కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో “100 మిలియన్ల మార్క్ సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News