Wednesday, January 22, 2025

వన్ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ‘సలార్, పార్ట్1 సీజ్ ఫైర్’

- Advertisement -
- Advertisement -

రెబెల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్‘ వన్ ఇయర్ సెలబ్రేేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్‘ వరల్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులువరుసగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మైమరపించాయి. ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్‘ రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్‘ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం ‘సలార్ 2, శౌర్యంగపర్వ‘ చిత్రీకరణ జరుపుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News