Friday, December 20, 2024

ఇక ఆన్‌లైన్‌లో సాలర్‌జంగ్ మ్యూజిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో భద్రపరిచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, నిక్షిప్తం చేసిన చరిత్రను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు. గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రాజెక్టులో భాగంగా వీటిని అంతర్జాలంలో అందుబాటులో ఉంచినట్లు మ్యూజియం డైరెక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి మంగళవారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు. సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు సమయం లేని వారికి ఉపయోగపడేలా ఆన్‌లైన్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వెల్లడించారు. కాగా డిజిటల్ వెర్షన్‌లో అరుదైన , పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, మను స్క్రిప్టులు, సిరామిక్స్, హస్తకళలను ప్రదర్శిస్తున్నారు.

సింబల్స్ ఆఫ్ గ్లోరీ పేరుతో ఆనాటి రాజుల దర్పం ప్రతిబింబించేలా ఇరువైపులా పదును ఉండే కత్తి, సాలార్‌జంగ్3 ఖడ్గం, షంషీర్ , నాగన్ తదితరాలకు సంబంధించిన వివరాలు, చిత్రాలను నిక్షిప్తం చేశారు. ‘ వండర్స్ ఇన్ వుడ్ ’ పేరుతో చెస్ ఆట పురోగతి, రెండో నిజాం సాహసయాత్ర, రాయల్ దక్కనీ కళాపోషణ వివరాలను డిజిటలైజ్ చేశారు. వీటితో పాటు మ్యాజిక్ ఆఫ్ బ్రాంజ్, ఇండియన్ ఎఫిక్స్ ఇన్ ఆర్ట్, ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌ చెస్ కాంకర్డ్ ది వరల్డ్ , భారతదేశ చరిత్రకు సంబంధించిన 467 ముఖ్యమైన చిత్రాలు, హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన 387 చిత్రాలు, ఫైబర్ ఆర్ట్ తదతర వివరాలు ఉన్నాయి. వివరాల కోసం https://artsandculture.google.com/partner/salar jung museum వెబ్ సైట్-ను సందర్శించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News