Monday, December 23, 2024

విదేశీ సంపాదనపై భారత్ లో పన్ను వేయరాదు: ట్రిబ్యూనల్ తీర్పు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ ఢిల్లీ: విదేశంలో పనిచేసి సంపాదించిన జీతానికి ఆదాయపు పన్ను విధించడం సరికాదని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యూనల్, ఢిల్లీ బెంచ్ తీర్పు చెప్పింది. నాన్-రెసిడెంట్ సర్వీసుల ద్వారా సంపాదించుకున్న దానికి భారత్ లో పన్ను విధించడం సరికాదని స్పష్టం చేసింది.

దేవీ దయాళ్ అనే వ్యక్తిని డిజిటల్ టెక్నాలజీస్ కు చెందిన భారత కంపెనీ ఓ ప్రాజెక్టు పై ఆస్ట్రేలియా పంపింది. ఆయనకు జీతం, కాంపెన్సేటరీ అలవెన్స్ వంటి భత్యం ఆ భారత కంపెనీ చెల్లించింది. ఆ మొత్తాన్ని ఆయన ఆస్ట్రేలియాలో క్రెడిట్ కార్డు ద్వారా పొందారు.  ఇదంతా 2016 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. ఆయన ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్(టిఆర్సి) ఇవ్వలేదంటూ ఆదాయపు పన్ను అధికారులు ఆయనకు రూ. 21.8 లక్షల పన్ను విధించారు.

నాన్-రెసిడెంట్స్ పన్ను మినహాయింపులు కోరినప్పుడే టిఆర్ సి సమర్పించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత కేసులో పన్ను ఒప్పందం కింద మినహాయింపులేవీ కోరనందున టిఆర్ సి సమర్పించాల్సిన అవసరం ఉండదని అమర్ పాల్ సింగ్ ఛధా వివరించారు. విదేశాల్లో సంపాదించి, అక్కడ పన్ను కట్టిన దానికి రుజువుగా ఇక్కడ భారత్ లో టిఆర్ సి సమర్పించడం తప్పనిసరి కాదని వాదించారు. విదేశాల్లో ప్రవాస భారతీయులు సంపాదించే జీత భత్యాలకు ఇక్కడ పన్ను కట్టాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News