Monday, December 23, 2024

గ్రామాలలో కల్తీ ఆహర విక్రయాలు

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : కష్టపడి పని చేసుకోని న్యాయంగా నాణ్యతగా విక్రయాలు చేసుకొని సంపాదించుకోవడం వేరు, బ్రతకడానికి ఏ మార్గం ఎంచుకున్న ఫర్వాలేదు కాని ఇతరులను ఆసరాగా చేసుకొని సోమ్ము చేసుకోవడం మాత్రం సరికాదు. బ్రతుకు దేరువు కోసం, కూటి కోసం కోటి తిప్పలు తప్పదు కాని కల్తీ ఆహారాలు విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడడం సరికాదు. అలాంటిది రాజంపేట్ మండలంలో కల్తీ ఆహర విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలోని అమయక ప్రజలను ఆసరాగా చేసుకొని విక్రయాలు మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం తినే ఆహారాలు కల్తీమయం అవుతున్న కనీసం గ్రామాలలో తనిఖీలు చేపట్టేవారు లేరు. కామారెడ్డి కేంద్రంగా రోజు మండలంలోని గ్రామాలలో నూనెలు, సమోసాలు, ఇడ్లి, వడలు, చెక్కర, గోధుమ పిండి వంటి వివిధ రకాల ఆహార పదార్థాలు మోటర్‌సైకిల్, వాహనాలలో వచ్చి విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాలలో కిరాణదుఖానాల వారు వాటిని తక్కువ ధరలకు తీసుకొని గ్రామంలో ప్రజలకు విక్రయాలు జరుపుతున్నారు. ఇటీవల కొండాపూర్ గ్రామంలో ఓ వ్యాపారి సమోసాలు విక్రయించగా అనుమానం వచ్చిన కొందరు సదరు వ్యక్తిని పట్టుకొని నిలదీశారు.

సమోసాలు వేడిగానే ఉన్న అందులో గల పదార్థాలు కుళ్ళిపోయిన వాసన రావడంతో ఇదేంది అంటు అక్కడి నుండి వెళ్ళకోట్టారు. అలాగే గ్రామాలలో విచ్చవిడిగా బేకరీలు వెలిశాయి. గుండారం, కొండాపూర్, రాజంపేట్, తలమడ్ల గ్రామాలలో అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి. పేరుకే వేడి వేడి అంటు రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన పదర్థాలు అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో గ్రామాలలోని ప్రజలు అనారోగ్యాలకు గురై కడుపు నొప్పి, అతిసారవ్యాధి సోకి ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. చిన్న పిల్లలకు ఇష్టమయ్యే పలురకాల ఫాస్టఫుడ్ సైతం వివిధ రకాల కల్తీలు చేసి అమ్మకాలు చేపడుతున్నారు . మరికొందరు తక్కువ ధరకే నాణ్యమైన పిండి అంటు తాము ఫ్యాక్టరీల నుండి తీసుకు వచ్చి కల్తీ లేకుండా విక్రయిస్తున్నాం అంటు 10 నుండి 20 కిలోల వరకు తీసుకవచ్చి కల్తీలు చేస్తూ అమ్ముతున్నారు.

కిరాణ షాపులలో నిల్వ ఉంచిన వివిధ రకాల పిండి పదార్థాలు, వస్తువులు పుచ్చు దులిపి అమ్మకాలు చేడుతున్నారు. ఇదేమని అడిగితే నీ ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే ఇక్కడి నుండి వెళ్ళపో అంటు వంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇదేం కర్మరా బాబు అంటు అవసరం అయిన పరిస్థితిలో కోనక తప్పడం లేదు. ప్రతి నెల తనిఖీలు చేయాలసిన అధికారులు ఎక్కడ అంటు మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అకస్మికంగా తనిఖీలు నిర్వహించి నాన్యమైన ఆహారం విక్రయాలు జరిగేలా చూడాలి కాని అలాంటివి మండలంలో ఎక్కడ కూడ కనిపించడం లేదు. ఇప్పటికైన అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News