Monday, December 23, 2024

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 62% తగ్గాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్రం సబ్సిడీలను తగ్గించిన తర్వాత జూన్ మొదటి పక్షం రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల తగ్గుముఖం పట్టాయి. జూన్ 15 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఇ2డబ్లు) సగటు రోజువారీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే 62.6 శాతం తగ్గాయి. మరోవైపు ఎలక్ట్రిక్ త్రీవీలర్, కార్ల అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల అమ్మకాలు 25.5 శాతం, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 16.1 శాతం పెరిగాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మే నెలలో రోజుకు సగటున 3,395 ఇ-టూ-వీలర్లు సేల్ అయ్యాయి.

జూన్ మొదటి పక్షం రోజుల్లో ఈ సంఖ్య 1,271కి తగ్గింది. గత నెల, విక్రయించిన మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఇ2డబ్లు వాటా 7.7 శాతం కాగా, ఈ నెలలో 2.6 శాతానికి తగ్గింది. ఎస్ అండ్ పి గ్లోబల్ డైరెక్టర్ పునీత్ గుప్తా మాట్లాడుతూ, సబ్సిడీలను తగ్గించిన తర్వాత చాలా కంపెనీలు జూన్ మొదటి వారంలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ వాహనాలు, పెట్రోల్ వాహనాల మధ్య ధరల అంతరం పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకర్షణ తగ్గింది. కానీ ఎలక్ట్రిక్ డిమాండ్ అలాగే ఉంది, సగటు రోజువారీ అమ్మకాలు 16 పెరిగాయి.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇలా..
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చూస్తే, విద్యుత్ ద్విచక్ర వాహనాలు మేలో 3,395 యూనిట్ల నుంచి జూన్ 15 నాటికి 1271 యూనిట్లతో -62.6 శాతం తగ్గాయి. ఇక పెట్రోల్ ద్విచక్ర వాహనాలు మేలో 44,926 యూనిట్ల నుంచి జూన్ 15 నాటికి 46,756 యూనిట్లతో 4.07 శాతం పెరిగాయి. విద్యుత్ త్రీవీలర్ వాహనాల సేల్స్ మేలో 1439 యూనిట్ల నుంచి జూన్ 15 నాటికి 1806 యూనిట్లతో 25.50 శాతం పెరిగాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ మేలో 254 యూనిట్ల నుంచి జూన్ 15 నాటికి 295 యూనిట్లతో 16.14 శాతం పెరిగాయి.

సబ్సిడీ తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుండి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై సబ్సిడీని రూ.15,000 నుండి రూ.10,000 కి తగ్గించింది. ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 40 శాతం గరిష్ఠ సబ్సిడీ పరిమితి కూడా 15 శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సబ్సిడీ నిధి ముగియనున్నందున ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మొత్తం బడ్జెట్‌లో 80 శాతం 10 లక్షల మందికి కేటాయించారు. ప్రస్తుతం ఒక్కో ద్విచక్ర వాహనానికి రూ.17,000 నుంచి రూ.66,000 వరకు రాయితీలు విద్యుత్ వాహన తయారీదారులకు ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ తర్వాత ఇది తగ్గనుంది. ప్రారంభించే సమయంలో ఎఫ్‌ఎఎం-2 కింద రూ. 10,000 కెడబ్లుహెచ్ ఇవ్వగా, తర్వాత దాన్ని రూ.15 వేలకు పెంచారు.

సబ్సిడీ కోసం రూ.10 వేల కోట్లు
ప్రభుత్వం ఫేమ్-2 పథకాన్ని ఏప్రిల్ 2019లో ప్రారంభించగా, ఇది ఐదేళ్లపాటు జరిగింది. మార్చి 24న ముగుస్తుంది. మొత్తం బడ్జెట్ రూ. 10,000 కోట్లు, ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వాలి. ఫిబ్రవరి 2023లో సమర్పించిన బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.5,172 కోట్లకు పెంచగా, రూ.3,889 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశారు. 2023 మార్చి 4 నాటికి దేశంలో 9,75,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు. 20222023లో విక్రయించిన ఇవిలలో 60 శాతం కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

ఎఫ్‌ఎఎంఇ2 పథకం అంటే?
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఎంఇ2 పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇస్తారు. ఎఫ్‌ఎఎంఇ1 పథకం కింద రూ.800 కోట్లు కేటాయించారు. ఫేమ్-2 కోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News