Wednesday, January 22, 2025

చలికాలం కావడంతో తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చలికాలం కావడంతో దేశం లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు బాగా తగ్గాయని ప్రభుత్వ యాజమాన్య ఇంధన సంస్థలు సోమవారం ప్రాథమిక డేటాను చూపించాయి. ఇంధన మార్కెట్‌లో 90 శాతం నియంత్రించే మూడు ప్రభుత్వ సంస్థలు పెట్రోల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈ డిసెంబర్‌లో 1.4 శాతం వరకు అంటే 2.72 మిలియన్ టన్నుల వరకు, అలాగే డీజిల్ డిమాండ్ 7.8 శాతం వరకు అంటే 6.73 మిలియన్ టన్నుల వరకు తగ్గినట్టు వెల్లడించాయి. ఉత్తరాదిలో చలికాలం ప్రారంభం కాగానే ఎయిర్ కండిషనింగ్ డిమాండ్ తగ్గింది.

నెలవారీ పోలిస్తే గత నవంబర్‌లో 2.86 మిలియన్ టన్నుల పెట్రోల్ వినియోగం కాగా, డిసెంబర్‌లో 4.9 శాతం వరకు తగ్గింది. అలాగే నవంబర్‌లో డీజిల్ 6.79 మిలియన్ టన్నుల వరకు వినయోగం కాగా, డిసెంబర్‌లో 0.8 శాతం వరకు డిమాండ్ తగ్గింది. గత అక్టోబర్‌లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరగ్గా, డిసెంబర్‌లో డీజిల్ వినియోగం 7.5 శాతం వరకు తగ్గింది. 2021లో కొవిడ్ ప్రభావిత డిసెంబర్‌లోకన్నా ఈ ఏడాది డిసెంబర్‌లో పెట్రోల్ వినియోగం 7.1శాతం ఎక్కువగా జరిగింది. అలాగే కరోనాకు ముందు 2019 డిసెంబర్ కన్నా ఈ ఏడాది డిసెంబర్‌లో 21.5 శాతం పెరిగింది. డీజిల్ వినియోగం 2019 డిసెంబర్‌తో పోలిస్తే 2.7 శాతం, 2021తోపోలిస్తే 4.3 శాతం పెరిగింది.

జెట్ విమాన ఇంధనం (ఎటిఎఫ్) అమ్మకాలు సంవత్సరాల వారీగా పరిశీలిస్తే ఈ ఏడాది డిసెంబర్‌లో 3.8 శాతం అంటే 644,900 టన్నుల వరకు పెరిగాయి. కానీ 2019 డిసెంబర్‌తో పోలీస్తే 6.5 శాతం తక్కువ. దీనికి కారణం కరోనా మహమ్మారి తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ తిరిగి ప్రారంభం కాలేదు. కరోనాకు ముందు 2019 డిసెంబర్‌తో పోలిస్తే అప్పటి ఇంధన వినియోగం 6,28,400 టన్నుల కన్నా ఇప్పుడు వినియోగం తగ్గినప్పటికీ, 2021 డిసెంబర్‌తో పోలిస్తే మాత్రం 25.5 శాతం వినియోగం ఎక్కువగానే కనిపిస్తోంది. నెలల వారీ జెట్ ఇంధనం అమ్మకాలను పరిశీలిస్తే 2023 నవంబర్‌లో 6,28.400 టన్నుల కన్నా ఎక్కువగా జరిగాయి.

ఇక వంటగ్యాస్ (ఎల్‌పిజి )అమ్మకాలు ఏటేటా దాదాపు ఒకేలా స్థిరంగా ఉండి ఈ ఏడాది డిసెంబర్‌లో 2.73 మిలియన్ టన్నులకు నిలిచాయి. ఎల్‌పిజి వినియోగం 2021డిసెంబర్ కన్నా 8.1 శాతం , 2019 డిసెంబర్ కన్నా 16.4 శాతం ఎక్కువగా కనిపించింది. అయితే ఎల్‌పిజి డిమాండ్ గత నవంబర్‌లో 2.57 మిలియన్ టన్నులు కాగా, డిసెంబర్‌లో 6.2 శాతం ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News