ఊపిరాడక శివ భక్తుడు మృతి
శివనామస్మరణతో మారుమ్రోగుతున్న నల్లమల
సలేశ్వరం జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు
మన తెలంగాణ/ దోమలపెంట : నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం యాత్రలో అపశృతి చోటుచేససుకుంది. లోయలో కిక్కిరిసిన జనంతో ఊపిరి ఆడక అభిషేక్ అనే యువకుడు మృతి చెందాడు. భక్తుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. నల్లమల దట్ట మైన అటవి ప్రాంతంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్స వాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దారి పొడవునా అటవీ అందాలు, శైవక్షేత్రాలు, జలపాతాలు,అనేకరకాల వన్య ప్రాణులు యాత్రికులకు కనువిందు చేసాయి. సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రా లతో పాటు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధిక సంఖ్య లో భక్తులు తరలివచ్చారు.
భక్తులసౌకర్యార్థం ఆర్టిసి సంస్థ ఆధ్వర్యంలో అచ్చంపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, దేవరకొండ, నల్లగొండ తదితర జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ను భక్తులకు ఏర్పాటు చేశారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎంత కష్టమైన ఇష్టం గా భావి ంచి రాళ్లు రప్పలు లెక్కచేయకుండా కాలినడకన స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లి ంచుకుం టున్నారు. స్వామి వారి దర్శనానికి వస్తూ వస్తున్నాం లింగమయ్య అంటూ శివనామస్మరణ లతో న ల్లమల అటవీ ప్రాంతం మారుమ్రోగింది. భక్తుల సౌకర్యార్థం ఆయా శాఖల అధికారులు చర్య లు చేప ట్టారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి వంటి వసతులను ఏర్పాటు చేశారు.