Monday, January 20, 2025

సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు: రామ్‌దేవ్

- Advertisement -
- Advertisement -

Salman Khan Consumes drugs: Ramdev Baba

మొరాదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే, పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని యోగా గురువు రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు. ముంబై కేంద్రంగా తారల డ్రగ్స్ వ్యవహారాలపై, మత్తుమందుల పార్టీలపై ఆయన స్పందించి తమ వ్యాఖ్యలతో వివాదానికి దారితీశారు. పేరు మోసిన నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత ఘటన గురించి అందరికి తెలిసిందే అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఆరంభిస్తూ ఆయన మాట్లాడారు. చిత్ర పరిశ్రమ ఒక్కటే కాదు, రాజకీయాలలో కూడా డ్రగ్స్ దందాలు విస్తరించుకున్నాయని, ఇది సత్యమే అన్నారు. మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగణ సదస్సులో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. షారూక్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లాడు. హీరోయిన్ల విషయం అయితే తనకు తెలియదని, అది ఆ భగవంతుడికే తెలుసునని వ్యాఖ్యానించారు. మత్తుమందు అలవాటు నుంచి భారతదేశం దూరం కావాలి. దీని కోసం తాము ఉద్యమిస్తామని ప్రకటించారు. మాదకద్రవ్యాల విముక్తి మేరకు అంతా ప్రతిన వహించాలని పిలుపు నిచ్చారు. రాజకీయాలకు లిక్కర్ పనిలో పనిగా మత్తుమందుకూడా విస్తరించుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు సరఫరా చేస్తారు. మత్తుమందు కూడా దీనికి తోడవుతోంది. ఇది ప్రమాదకరమైన విషయం అన్నారు.

Salman Khan Consumes drugs: Ramdev Baba

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News