Friday, December 20, 2024

సల్మాన్ ఇంటివద్ద కాల్పుల సంఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద ఇటీవల జరిగిన కాల్పులకు సంబంధించి కస్టడీకి తీసుకున్న కొంతమంది నిందితుల్లో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ లాకప్‌లో ఉన్న అతడు బుధవారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లి బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అధికారులు అప్రమత్తమై సమీపం లోని ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీస్‌లు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్‌ను ఏప్రిల్ 26 న పోలీస్‌లు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఇంటివద్ద ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబై లోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో సల్మాన్ ఉంటున్నారు. అక్కడకు మోటారు సైకిల్‌పై ఇద్దరు వచ్చి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. నిందితులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా నిందితులు విక్కీగుప్తా, సాగర్ పాల్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్‌ను అదుపు లోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చగా,సోను మినహా మిగతా ముగ్గురికి న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది. అనారోగ్యం కారణంగా సోనును కస్టడీకి ఇవ్వాలని పోలీస్‌లు కోరలేదు. ఈ నలుగురు నిందితులు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News