Thursday, January 23, 2025

ముంబయ్‌లో ‘గాడ్‌ఫాదర్’తో సల్మాన్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేనవిధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘సైరా సరసింహారెడ్డి’ తరువాత ఆయన వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయి ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. మరి కొన్ని చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కొన్ని ఇప్పుడిప్పుడే పట్టాలెక్కాయి. అందులో మలయాళ హిట్ చిత్రం ‘లూసీఫర్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మోహన్ రాజా ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. యంగ్ హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే కొంత షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయట. అందుకే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలని చాలా ప్రత్యేకంగా షూట్ చేయాలని ప్లాన్ చేశారు. ముంబయ్‌లో సోమవారం వీరిద్దరికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాల్గొనగా కీలక ఘట్టాలని ఎన్‌డి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ స్టూడియోలో సెట్‌ని నిర్మించారట. అందులోనే చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ల మధ్య సన్నివేశాలని సోమవారం నుంచి చిత్రీకరించడం మొదలుపెట్టారని తెలిసింది. మెగాస్టార్‌తో గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ మంచి అనుబంధాన్ని కలిగివున్నారు. ఆ కారణంగానే ‘గాడ్ ఫాదర్’లోని కీలక అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించారట. భారీ అంచనాల మధ్య యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త మేకోవర్‌తో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో చిరుకు సోదరిగా నయనతార కనిపించనుందని, మలయాళ చిత్రంలో మంజు వారియర్ పోషించిన కీలక పాత్రలో నయనతార కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Salman Khan Joins Chiranjeevi’s ‘Godfather’ Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News