Monday, December 23, 2024

‘గాడ్ ఫాదర్’తో సల్మాన్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారు. మలయాళ హిట్ చిత్రం ‘లూసీఫర్’ ఆధారంగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో సల్మాన్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా చిరంజీవి, సల్మాన్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కూడా నటిస్తున్నారు.

Salman Khan joins GodFather Shoot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News