Monday, December 23, 2024

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం… పోలీసులకు ఫోన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి మాట్లాడుతున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపేస్తామని పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజస్థాన్ చెందిన యువకుడు థానే జిల్లాలోని షాహాపూర్‌లో గోశాల రక్షకుడిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి ముంబయి ప్రధాన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తాను రాజస్థాన్ నుంచి మాట్లాడుతున్నానని ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. పోలీసులు పోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి న్యాయ ప్రక్రియల కోసం అతడిని ముంబయి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News