Wednesday, January 8, 2025

నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

బాంద్రాలోని నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. బాల్కనీలో బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను, బయట రోడ్డు మీది దృశ్యాలను కూడా కవర్ చేసే విధంగా హైటెక్ సిసిటివి కెమెరా సిస్టంను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను పోలీసు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. నటుడు సల్మాన్ ఖాన్ తన ఫ్లాట్ గాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో బాల్కనీలోకి వచ్చి అభిమానులను గ్రీట్ చేసేప్పుడు ఆయన భద్రత కోసం బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ కిరాయికి తెచ్చిన ప్రైవేట్ కాంట్రాక్టర్ ఈ భద్రత ఏర్పాట్లను పెంపొందించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులు 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట నుంచి కాల్పులు జరిపాక ఆయన భద్రతా ఏర్పాట్లు పెంచుకున్నారు. ఎవరైనా బయట అనుమానస్పదంగా తిరుగాడుతుంటే కనిపెట్టడానికి హైటెక్ సిసిటివి కెమెరాను ఏర్పాటు చేయడమేకాక, ఇంటి చుట్టూ రేజర్ వైర్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్ ఖాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయి. 2024 జూన్‌లో ముంబైలోని తన పన్‌వెల్ ఫామ్‌హౌస్‌కు వెలుతుండగా సల్మాన్‌ని చంపేందుకు ఓ ప్లాట్ కూడా రచించిన విషయాన్ని నవీ ముంబై పోలీసులు కనిపెట్టారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు పోలీసులు 24 గంటలపాటు రక్షణ కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News