Monday, December 23, 2024

చంపేస్తామంటూ బెదిరింపులందుతున్నాయి: సల్మాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్‌కు భద్రత బలంగా ఉన్నప్పటికీ చంపేస్తామంటూ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆయన మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌లో ఒక ఇంటర్యూలో ఆయన ‘నాకు భారత్‌లో చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నాకు సురక్షితంగా ఉంది. ఏమేమి జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారో అవన్నీ పాటిస్తున్నాను’ అన్నారు.

సల్మాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు వై-కేటగిరి రక్షణ కల్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు బెదిరింపులు అందాక సెక్యూరిటీ ఎస్కార్ట్‌లను కూడా ఇచ్చింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు అందాయి. ఆయనకు బెదిరింపు కాల్, లెటర్ కూడా వేర్వేరు వ్యక్తుల నుంచి అందాయి.

‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ “ రక్షణ లేకపోవడం కన్నా రక్షణ ఉండటం మంచిది. నాకు సెక్యూరిటీ ఉంది. నేనిప్పుడు రోడ్లపై సైకిల్ నడపడం, ఎక్కడి కంటే అక్కడికి వెళ్లడం కుదరదు. నేను ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. వారు నన్ను దూరం నుంచి చూస్తుంటారు. నా అభిమానులను చూస్తుంటే అయ్యో అనిపిస్తుంటుంది. నాకు బెదిరింపులున్నాయి. అందుకే నాకు సెక్యూరిటీ ఉంది. నన్నేమి జాగ్రత్తలు తీసుకోమంటున్నారో అవన్నీ చేస్తున్నాను. నా ఇటీవలి సినిమా ‘కిసీకా భాయ్, కిసీ కీ జాన్’ లో ఓ మాటుంది. ‘వారికి అదృష్టం ఒక్క సారే, నాకు వంద సార్లు.’ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి” అని చెప్పుకొచ్చారు.

Salman Khan 1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News