Wednesday, January 22, 2025

గణేశుడి పూజ నిర్వహించిన సల్మాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ గణేశ్ చతుర్థిని తన కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు. ఆయన పూజ చేసేప్పుడు ఆయన సోదరి అర్పిత, బావ ఆయుష్ శర్మ కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్ పూజ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.  పూజ పల్లెంతో హారతి ఇస్తున్న దృశ్యం వైరల్ అయింది. ఆ సమయంలో అతడి సోదరులు అర్బాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ కూడా ఉన్నారు. అంతేకాక వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. తన ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించాక సల్మాన్ ఖాన్ అంబానీ ఇంటికి వెళ్లి వారింట్లో పూజలో పాల్గొన్నారు.

సల్మాన్ ఖాన్ ప్రతి ఏట గణేశ్ చతుర్థి వేడుకలలో పాల్గొంటూ ఉంటారు. ఆయన తండ్రి ముస్లిం అయినప్పటికీ తల్లి హిందువే. కనుక అటు ఇస్లాం, ఇటు హిందు వేడుకల్లో కూడా సల్మాన్ ఖాన్ పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్,  ఏ.ఆర్. మురుగా దాస్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన పక్కటెముకలు రెండు విరిగాయి. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘బిగ్ బాస్’ హోస్ట్ గా కూడా ఆయన పనిచేస్తున్నారు.

Salman Khan 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News