Tuesday, December 3, 2024

హైదరాబాద్‌లో సల్మాన్‌ఖాన్ షూటింగ్..భద్రత పటిష్టం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ స్టార్ హోటల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ పై ‘సికందర్’ సినిమా షూటింగ్ జరుగుతుండడంతో భద్రతను మరింత పటిష్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో పోలీస్‌లు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించినప్పటికీ, సల్మాన్‌ఖాన్ కు స్వంత భద్రత ఉందని పోలీస్‌వర్గాలు శనివారం వెల్లడించాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గత కొన్నాళ్లుగా బెదిరింపులు వస్తున్నప్పటికీ,

తాజాగా బెదిరింపులు మళ్లీ వచ్చాయని ముంబై అధికారులు శుక్రవారం వెల్లడించారు. రూ. 5 కోట్లు చెల్లించకపోతే ప్రాణాలు తీస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ గురువారం హెచ్చరించింది. “మైన్ సికిందర్ హూ” అనే పాట రచించిన రచయితకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీస్‌ల ఫిర్యాదుపై వొర్లి పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు. పుష్ప చిత్రం ఆధారంగా సికిందర్ చిత్రం తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ నటి రష్మిక మందన్నతో సల్మాన్‌ఖాన్‌పై జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News