Monday, December 23, 2024

సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తున్న విద్యార్థికి “లుక్ అవుట్ ” జారీ

- Advertisement -
- Advertisement -

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరిస్తున్నాడన్న నేరారోపణపై బ్రిటన్ లోని భారతీయ విద్యార్థికి ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. నిందితుడు హర్యానాకు చెందిన వాడు. వైద్య విద్యలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. బ్రిటన్‌లో తన విద్యాసంవత్సరం ముగిసి పోతున్నందున ఈ ఏడాది ఆఖరులో ఆ విద్యార్థి స్వదేశానికి రావచ్చు.

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ పేరు మీద నిందితుడు బెదిరింపు మెసేజ్‌లను సల్మాన్ ఖాన్‌కు తరచుగా పంపుతున్నట్టు పోలీస్‌లు గమనించారు. కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్ అన అధికారిక ఐడీ లపై ఈ మెయిల్ రావడం గమనించారు. తక్షణం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్‌ను కలుసుకోవాలని, వారి మద్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని ఆ మెసేజ్‌లో ఉంది. అలా చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మెసేజ్‌లో హెచ్చరించి ఉంది. ముంబై పోలీసులు ఇటీవలనే సల్మాన్ ఖాన్‌ను చంపుతానని బెదిరించిన మైనర్ బాలుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News