Wednesday, January 22, 2025

సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

- Advertisement -
- Advertisement -

యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ లేటెస్ట్ చిత్రం ‘టైగర్ 3’ దీపావళి పండుగ సీజన్‌లో సందడి చేయడానికి రెడీగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ జంటగా నటించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 12 అంటే ఆదివారం నాడు ‘టైగర్ 3’సినిమాని రిలీజ్ చేయబోతోన్నారు. నవంబర్ 12న ఉదయం ఏడు గంటలకు మొదటి షో పడిపోనుందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు.

నవంబర్ 5 నుంచి ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయని నిర్మాతలు ప్రకటించారు. స్పాయిలర్స్‌ను కట్టడి చేసేందుకు ఏడు గంటలకు షోను వేయమని అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏక్ థా టైగర్, టైగర్ హై జిందా, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న ఐదో చిత్రమే ఈ టైగర్ 3.  ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు.

మల్టీప్లెక్సుల్లోని అన్ని ఫార్మాట్లలో ఈ చిత్రం రానుంది. 2డీ, ఐమాక్స్ 2డీ, 4డీఎక్స్ 2డీ, పీవీఆర్ ఎక్స్ఎల్, డీబాక్స్, ఐసీఈ, 4డీఈ మోషన్ ఇలా అన్ని ఫార్మాట్లలో రానుంది. వైఆర్ఎఫ్ యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. హిందీ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News