Wednesday, January 22, 2025

అభిమానులను మందలించిన సల్మాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

సల్లూ భాయ్ సినిమా రిలీజైందంటే అభిమానులకు పండగే. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. తాజాగా రిలీజైన సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ 3’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అభిమానుల కోలాహలంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటోంది. అయితే కొన్ని థియేటర్ల వద్ద వారి హడావిడి మితిమీరి, ఇతర ప్రేక్షకులకు ప్రాణసంకటంగా పరిణమిస్తోంది.

మహరాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్ ఛావ్నీ ప్రాంతంలోని మోహన్ సినిమా థియేటర్లో సల్లూ భాయ్ అభిమానులు రెచ్చిపోయారు. ఒకవైపు సినిమా నడుస్తూండగా, అభిమానులు థియేటర్లోనే పటాసులు పేల్చడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు పెట్టారు. ఈ విషయం సల్మాన్ ఖాన్ దృష్టికి వచ్చింది. దీనిపై సల్లూ భాయ్ సోమవారం అభిమానులను సుతిమెత్తగా మందలించారు. థియేటర్లో టపాసులు పేల్చడంవల్ల అభిమానులు తాము ప్రమాదంలో పడటమే కాకుండా, ఇతరులనూ ప్రమాదానికి గురి చేస్తారని, కాబట్టి ఇలాంటి పనులకు పాల్పడకూడదని, సినిమా చూసి ఎంజాయ్ చేయాలని సల్మాన్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News