Monday, December 23, 2024

చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

Salman khan who plants planted

అంటార్కిటికాలో జెండా ఆవిష్కరణ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్. చిత్రంలో రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్

కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మంచు ఖండంపై జెండా ప్రదర్శన
గొప్ప గౌరవం దక్కింది, మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం : ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటమే లక్షంగా, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా ఛాలెం జ్ వాలంటీర్‌కు చోటు దక్కింది. 35 దేశాల నుంచి 150 మంది సభ్యులతో కూడిన బృందంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటార్కిటికా ప్రయాణించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పు లు, ఎదురయ్యే సవాళ్లపై ఈ బృందం అధ్యయనం చేసిం ది. ఫౌండేషన్ – 2041 నెలకొల్పి భూగోళంతో పాటు, అంటార్కిటికా పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్‌ను ఈ పర్యటనలో గ్రీన్ ఇండియా ఛా లెంజ్ వాలంటీర్ కలిశారు. గత ఐదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, భారతదేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం విస్తరిస్తున్న తీరును వివరించారు.

చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. ఉత్తర, దక్షిణ ధృవాలన రెండింటినీ సందర్శించిన వ్యక్తిగా, పర్యావరణం కోసం పాటుపడుతూ, అంతర్జాతీయ సమాజాన్ని ఆ దిశగా చైతన్యవంతం చేస్తున్న వాలంటీర్‌గా రాబర్ట్ స్వాన్‌ను ఐక్యరా జ్య సమితి గుర్తించింది. అంటార్కిటికా యాత్రలో పాల్గొ న్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపి జోగినపల్లి సం తోష్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందించారు. ట్విట్టర్ వేదికగా రాబర్ట్ స్వాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు ధృవాలను సందర్శించిన పర్యావరణవేత్త చేతులమీదుగా అంటార్కిటికాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకం ఆవిష్కరించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. మరింత చిత్తశుద్ధితో తమ పర్యావరణ ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సల్మాన్ ఖాన్

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చి న సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0’లో పాల్గొన్నారు. అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొ క్కను నాటామా పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకూ శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశం లో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని, ఆ పనికి జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా బాటలు వేశారని, దానిని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

తన అభిమానులంతా విధిగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యులు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కు మార్ మాట్లాడుతూ పెద్ద మనసుతో ‘గ్రీన్ ఇండియా ఛా లెంజ్’లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్‌ఖాన్‌కి కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్ఫూ ర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ‘విరాటపర్వం’ టీమ్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో ‘విరాటపర్వం’ చిత్ర బృందం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు నవీన్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ డానిలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News