Thursday, January 16, 2025

సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని మేమే చంపాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌

- Advertisement -
- Advertisement -

ముంబయి:  నేషనలిస్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో విజయ దశమి రోజున బాంద్రాలో సిద్దిఖీని ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో అరెస్టయిన వారిని హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పినట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News