Monday, December 23, 2024

సల్మాన్ ఖాన్ ఇంటిపై రెక్కీ

- Advertisement -
- Advertisement -

ముంబై: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన నలుగురిని ముంబై పోలీసులు అరెస్టు  చేశారు. వారు నటుడు సల్మాన్ ఖాన్ కారుపై పన్వెల్ వద్ద దాడి చేయడానికి ప్రణాళిక రచిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 17 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. వారిలో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ కూడా ఉన్నారు.

వారు పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి, దాడి చేశాక శ్రీలంకకు తప్పించుకోవాలన్న ప్లాన్ లో ఉన్నారని కూడా పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు అరెస్టు చేసిన వారు ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియ  అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీమ్ చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ కూడా ఉన్నారు. ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా గ్యాంగ్ కు చెందిన 60 నుంచి 70 మంది సమాచారం పోలీసుల వద్ద ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News