Wednesday, January 22, 2025

టైగర్3’ నుంచి ‘టైగర్ కా మెసేజ్’ సెన్సేషన్

- Advertisement -
- Advertisement -

భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నఅగ్ర బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్. ఈ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘టైగర్3’. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయిక. లెజెండ్రీ ఫిల్మ్ మేకర్ యష్ చోప్రా బర్త్ డే సందర్భంగా ‘టైగర్3’ నుంచి ‘టైగర్ సందేశం (టైగర్ కా మెసేజ్)’ పేరుతో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ‘టైగర్ 3’ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘టైగర్ సందేశం’ వీడియోతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

‘టైగర్ సందేశం (టైగర్ కా మెసేజ్)’ వీడియోతో ‘టైగర్ 3’ మేకర్స్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశారు. సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ స్పై ఏజెండ్ టైగర్ అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్‌‌గా మరోసారి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సల్మాన్ ఫ్యాన్స్‌ని, అభిమానులను మెప్పించటానికి సిద్ధమయ్యారు.

‘టైగర్ కా మెసేజ్’లో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వెలువరిచారు. ఇది ప్రతీకార యాక్షన్ ఎంటర్‌టైనర్. వీడియోలో చూపించినట్లు టైగర్ ప్రాణాలకు తెగించి శత్రువులను వేటాడటానికి సాహసాలను చేస్తున్నాడు. అలాగే టైగర్ తన దేశం కోసం, కుటుంబం కోసం ఈ సందేశాన్నిచ్చారు. తనను ఆపటం అంత సులువు కాదనిపిస్తోంది. సందేశాన్ని పంపిన తర్వాత భారీ ఆయుధాలతో ఒంటరిగా సైనికుల సమూహాన్ని ఎదుర్కొవటాన్ని వీడియోలో చూపించారు.

‘టైగర్ సందేశం (టైగర్ కా మెసేజ్)’ వీడియో చివరలో చెప్పిన డైలాగ్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్లింది. రేపు థియేటర్స్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్3’ సినిమా చూసే ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందనిపిస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో ఐదవ సినిమాగా ‘టైగర్ 3’ వస్తుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ చిత్రాల తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తన స్పై యూనివర్స్‌ను ‘టైగర్ 3’ నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్తోంది. ‘టైగర్ 3’ చిత్రాన్ని మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో మెప్పించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News