Wednesday, January 22, 2025

సల్మాన్ కొత్త లుక్ అదుర్స్!

- Advertisement -
- Advertisement -

కండలవీరుడు సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో తిరుగులేని హీరోగా చెలామణీ అవుతున్నాడు. ప్రతి సినిమాకు తనను తాను అప్ గ్రేడ్ చేసుకుంటూ, అభిమానులను అలరిస్తున్నాడు. కెరీర్ మొదట్లో లవర్ బాయ్ లుక్ లో సినిమాలు చేసినా, ఆ తర్వాత కండలు పెంచి, వెండి తెరపై విలన్ల భరతం పడుతూ ప్రేక్షకులను కేరింతలు కొట్టించడం మొదలుపెట్టాడు. సల్మాన్ తాను నటించిన సినిమాలో కనీసం ఒక్క సీన్ లోనైనా చొక్కావిప్పి సిక్స్ పాక్ చూపించాల్సిందే.

తాజాగా సల్మాన్ ఖాన్ లుక్స్ చూసిన అభిమానులు షాక్ తింటున్నారు. ముంబయిలోని తన గ్యాలక్సీ అపార్ట్ మెంటులో సల్మాన్ తీయించుకున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సల్మాన్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఖాకీ ప్యాంటు, నల్ల బనీనులో సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. అన్నిటికీ మించి, అతను మరింతగా కండలు పెంచాడు. ఇలా సల్మాన్ ను ఇంతకుముందు చూడలేదనీ, బహుశా సల్మాన్ త్వరలో  నటించబోయే సినిమా కోసం ఇలా కండలు పెంచి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం టైగర్ 3 సక్సెస్ ను ఆస్వాదిస్తున్న సల్మాన్ త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే మూవీలో నటిస్తాడని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News