Wednesday, January 22, 2025

సల్మాన్ రష్దీ మాట్లాడుతున్నారు !

- Advertisement -
- Advertisement -

 

Salman Rushdie off ventilator and talking

న్యూయార్క్: ఇటీవల కత్తిపోట్లకు గురయిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్ల నుండి బయటపడ్డారు. మాట్లాడుతున్నారు. దుర్ఘటన జరిగిన చౌతక్వువా ఇనిస్టిట్యూషన్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ముంబయిలో జన్మించిన సల్మాన్ రష్దీ ‘సాటానిక్ వర్సెస్’ అనే నవల రాసి ఇరాన్, ముస్లింల ఆగ్రహానికి గురయ్యాడు. దాని ఫలితంగానే ఇటీవల ఆయనపై ప్రాణాంతక దాడి జరిగింది. దాడి కారణంగా సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోనున్నారు. నేరస్థుడు ఆయన చేతుల నరాలను కోసేశాడు. నేరస్థుడైన హాదీ మతర్ తాను నిర్దోషినని కోర్టు ముందు వాదించాడు. అతడిపై హత్యాయత్నం నేరారోపణ మోపబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News