Sunday, January 19, 2025

ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి

- Advertisement -
- Advertisement -

లక్నో: సెలూన్ యజమాని ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు, పారిపోతున్న అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుడౌన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బుడౌన్ జిల్లా కేంద్రంలోని బాబా కాలనీలో సాజీద్(22) అనే వ్యక్తి సెలూన్ నిర్వహిస్తున్నాడు. కాంట్రాక్టర్ వినోద్ టాకూర్ ఇంట్లోకి సాజీద్ గొడ్డలితో ప్రవేశించాడు. అయుష్(13), అహాన్(06) గొడ్డలితో దాడి చేయడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పియుష్‌ను(08) ఆస్పత్రికి తరలించారు.

సాజీద్, వినోద్ వివిధ మతాలకు చెందిన వారు కావడంతో స్థానికులు సెలూన్ తగలబెట్టారు. వెంటనే సాజీద్ అక్కడి నుంచి తప్పించుకొని అలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడిని వెంబడించడంతో వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మధ్య పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News