Monday, January 20, 2025

ఉప్పులేని ఆహారంతో గుండె సమస్యల ముప్పు దూరం

- Advertisement -
- Advertisement -

ఆహారంలో ఉప్పు శాతం ఎంత తగ్గిస్తే గుండె సమస్యల ముప్పు అంత తగ్గుతుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఆహారంలో ఉప్పు చేర్చడం వల్ల గుండె జబ్బులు, అకాల మరణాలు ఏ విధంగా పెరుగుతాయో పరిశోధకులు కనుగొన్నారు. ఆహారంలో ఉప్పు తగ్గడం వల్ల, ఉప్పు ఎక్కువగా చేర్చడం వల్ల ఆరోగ్యంలో వచ్చే తేడాలను పరిశోధకులు అంచనా వేశారు. ఆహారంలో అసలు ఉప్పు లేకుండా వినియోగించేవారిలో 18 శాతం వరకు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అంటే కర్ణిక దడ చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కర్ణిక దడ అంటే స్ట్రోక్, రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుంది. ఈ విధమైన పరిస్థితి బ్రిటన్‌లో గత దశాబ్ద కాలంలో 50 శాతం వరకు పెరిగి, 1.5 మిలియన్ మంది వరకు రోగుల సంఖ్య చేరుకుంది. ఈ ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ ఫలితంగా గుండె దడ విపరీతంగా పెరిగిపోయి, తలతిరగడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, అలసట దాపురిస్తాయి.

ఇలాంటి పరిస్థితి చివరకు స్ట్రోక్ ఐదు రెట్లు రాడానికి దారి తీస్తుంది. దక్షిణ కొరియా లోని క్యుంగ్‌పూక్ నేషనల్ యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ యూన్‌జంగ్ పార్క్ ఈ అధ్యయనం గురించి వివరిస్తూ ఉప్పు ఆహారంలో ఎంత తగ్గిస్తే ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అంత తగ్గుతుందని పేర్కొన్నారు. అమ్‌స్టర్‌డామ్‌లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశంలో ఈ పరిశోధన ఫలితాలను సమర్పించారు. ఈ పరిశోధనలో బ్రిటన్ బయోబ్యాంక్ డేటాను వినియోగించారు. బ్రిటన్‌లో 2006 నుంచి 2010 వరకు 40 నుంచి 70 ఏళ్ల వారిని దాదాపు 5 లక్షల మందిని ఈమేరకు అధ్యయనం చేశారు.

అప్పటికే ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్, గుండె రక్తనాళాల సంకోచ వ్యాధులున్న వారిని, గుండె వైఫల్యం, స్ట్రోక్ పరిశోధనలో మొదట మినహాయించారు. ఆహారంలో అసలు ఉప్పు తీసుకోలేని వారికి 18 శాతం వరకు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ సమస్య తగ్గినట్టు, ఎవరైతే అప్పడప్పుడు ఉప్పు వాడతారో వారిలో 15 శాతం వరకు తగ్గుదల కనిపించినట్టు తెలుసుకున్నారు. మామూలుగా ఉప్పు వాడే గ్రూపు వారిలో 12 శాతం వరకు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ తగ్గుదల కనిపించింది. రోజుకు 6 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు వాడరాదన్న ప్రభుత్వ సిఫార్సుకు కట్టుబడి ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News