Monday, December 23, 2024

సాలురా తహసీల్దార్ మమతకు ఘనసన్మానం

- Advertisement -
- Advertisement -

బోధన్: నూతనంగా ఏర్పడిన సాలురా మండల తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన మమతను పలు గ్రామాల సర్పంచులు మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలు అందించారు. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలపై తహసీల్దార్‌తో చర్చించారు. సాలురా నూతన మండలంగా ఏర్పడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎవరికి తలొగ్గకుండా తమ విధులలో భాగంగా ప్రజలకు విధిగా సేవలందించాలని కోరారు. గ్రామాలలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్‌కు విన్నవించారు. విధిగా తమకు సహకారం అందిస్తూ సమస్యల పరిష్కారానికి చేదోడు వాదోడుగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు చింతం నాగయ్య, షేక్ అమీర్, గంగాధర్, సాలురా గ్రామ పెద్దలు బుయ్యన్ సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News