అవమానాలు ఎదుర్కొన్న చోటే అమరవీరులకు
స్మారక చిహ్నం అరుదైన స్టెయిన్ లెస్
స్టీలుతో ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం
అమరుల త్యాగాలు నిరంతరం
జ్వలిస్తూ ఉండేలా నిర్మించాం రేపే
సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
సమరయోధులను విస్మరించిన కాంగ్రెస్
‘మనతెలంగాణ’ప్రత్యేక ఇంటర్వూలో రోడ్లు,
భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ :అవమానించబడ్డ చోటే అమరవీరుల స్మా రక చిహ్నం…అరుదైన స్టెయిన్ లెస్ స్టీలుతో ప్రపంచంలోనే అతిపెద్ద క ట్టడం.. తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలి స్తూ ఉండేలా, దీపం ఆకృతి వచ్చేలా అమర వీరుల స్మారకం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఎక్కడైతే ప్రత్యేక తెలంగాణ కోసం జలదృశ్యం మీటింగ్ జరిగిందో అదే స్థలంలో సిఎం కెసి ఆర్ నేతృత్వంలోనే అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం పూర్తయ్యిం ది. హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు న్న ఈ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరుల త్యాగా లను ప్రతిబింబించేలా దీని నిర్మాణం జరిగింది.
రాష్ట్రానికి అతిథులు, ప్రముఖులు ఎవరు వచ్చినా…
టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటును జీర్ణించుకోలేక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలదృశ్యం కార్యాలయంలో సామా న్లు, ఫర్నీచర్ బయట పడేయించారు. తాము ఎక్కడైతే అవమానించబ డ్డమో ఇప్పుడు అదే ప్రాంతంలో సిఎం కెసిఆర్ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అతిథులు, ప్రముఖులు ఎవరూ వచ్చినా ఈ స్మారకాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 22వ తేదీన సిఎం కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్న అమరవీరుల స్మారక చిహ్నానికి సంబంధించిన విశేషాలను ఆయన ‘మనతెలంగాణ’తో పంచుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా జరిగిన ఈ నిర్మాణం గురించి ఆయన మాటల్లోనే….. అమరుల త్యాగాల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ దేశ రాజధాని ఢిల్లీలో అమర వీరుల స్మారకార్థం గొప్ప కట్టడం ఏమైనా నిర్మించిందా..? అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులనే కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. వారి త్యాగాలు గుర్తు చేసే ఒక్క నిర్మాణ మైనా ఢిల్లీలో ఎందుకు లేదు..? దేశం కోసం అసువులు బాసిన వారి త్యా గాలు దేశాన్ని ఏలిన వారికి పట్టవా…? రాహుల్ గాంధీ, పనికి మాలిన విమర్శలు చేసే రేవంత్ సమాధానం చెప్పాలి. తెలంగాణ అమరవీరుల స్మారకం మనసుపెట్టి నిర్మిం చాం. కాంగ్రెస్‌తో ఈ ఆలోచనా, ఈ నిర్మాణం సాధ్యమే కాదు. ప్రతిపక్ష నాయకులు అమరుల స్మారకాన్ని సందర్శించి, నివాళులు అర్పించాలని కోరుతున్నా.
తెలంగాణ ప్రగతి చాటి చెప్పే ప్రదర్శన
ఈనెల 22వ తేదీన సిఎం చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించనున్నాం. మొదటగా కెసిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచే అమరజ్యోతికి సెల్యూట్ చేస్తారు. ప్రభుత్వం తరుపున సిఎం సమక్షంలో పోలీస్ గన్ సెల్యూట్ ఉంటుంది. అంబేద్కర్ విగ్రహ చౌరస్తా నుంచి అమరుల స్మారకం వరకు 5వేల మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయి. సాయంత్రం సుమారు 800 డ్రోన్లతో అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రగతి చాటి చెప్పే ప్రదర్శన ఉంటుంది. అమరుల స్మారకం ఆవిష్కరణ సందర్భంగా వారి త్యాగాలు స్మరిస్తూ సుమారు 10వేల మందితో దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం మనదే
ఈ అమరవీరుల స్మారకస్థూపం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మాణం జరిగింది. ఇలాంటి స్టీల్ కట్టడాలు ప్రపంచంలోనే మూడు మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని చికాగోలో, రెండోది దుబాయ్‌లో, మూడోది ఈ అమరవీరుల స్థూపం. ఈ రెండింటికంటే మనదే అతి పెద్దది.